ED summons to Mahua Moitra for third time
తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రాకు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మూడోసారి సమన్లు జారీ చేసింది. విదేశీ మారకద్రవ్యం తరలింపులో
అవకతవకల కేసులో విచారణకు మార్చి 28న హాజరు కావాలని ఆ సమన్ల సారాంశం.
మహువా మొయిత్రాకు ఈ కేసులో తొలుత ఫిబ్రవరి 19న,
రెండోసారి మార్చి 11న ఈడీ అధికారులు సమన్లు జారీ చేసారు. కానీ మహువా విచారణకు
హాజరుకాలేదు. ఇప్పుడు మూడోసారి ఈడీ తమ ఢిల్లీ ప్రధాన కార్యాలయంలో విచారణకు
హాజరవాలంటూ మహువాకు సమన్లు జారీ చేసింది.
ఆ కేసుకు సంబంధించి కొన్ని విదేశీ పెట్టుబడుల
వివరాలతో విచారణకు రావాలంటూ ఈడీ స్పష్టంగా అడిగింది. మహువా ఫెమా చట్టం నిబంధనలను పాటించిందో
ఉల్లంఘించిందో తేల్చుకోవాలని ఈడీ భావిస్తోంది.
49ఏళ్ళ మహువా మొయిత్రాను సీబీఐ కూడా
విచారిస్తోంది. పార్లమెంటులో ప్రశ్నలకు డబ్బులు తీసుకుందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న
కేసులో, లోక్‌పాల్ సిఫారసు మేరకు సీబీఐ ప్రాథమిక విచారణ చేపట్టింది. ఆ కేసు ఆధారంగానే
ప్రస్తుతం ఈడీ కేసు కూడా నమోదయింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, వ్యాపార సంస్థ అదానీ
గ్రూప్‌ను లక్ష్యం చేసుకుని లోక్‌సభలో ప్రశ్నలు అడగానికి దర్శన్ హీరానందానీ అనే
వ్యాపారవేత్త దగ్గర మహువా మొయిత్రా డబ్బులు తీసుకున్నారని, తద్వారా జాతీయ భద్రత
విషయంలో రాజీపడ్డారని బీజేపీ నేత నిశికాంత్ దూబే ఆరోపించారు. తన బదులు వేరేవారు
పార్లమెంటు ఆన్లైన్ పోర్టల్‌లో ప్రశ్నలు సంధించారని మహువా ఒప్పుకుంది.
ఆ కేసుకు
సంబంధించి డిసెంబర్ 8న ఎథిక్స్ కమిటీ ప్రాథమికంగా మహువా మొయిత్రాను లోక్‌సభ నుంచి
బహిష్కరించింది. అదానీ గ్రూపు వ్యవహరాల గురించి తను ప్రశ్నలు సంధించినందుకు తనను లక్ష్యం
చేసుకున్నారనీ, అంతేతప్ప తను ఎలాంటి తప్పూ చేయలేదనీ మహువా /చెబుతోంది. తనను సభ
నుంచి బహిష్కరించడంపై మహువా మొయిత్రా సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించింది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు