లిక్కర్
స్కామ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత
అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు పై విదేశాలు స్పందించడాన్ని భారత్ తీవ్రంగా
పరిగణిస్తోంది. ఆయా దేశాలకు తగురీతిలో బదులిస్తోంది.
అమెరికా
స్పందనను తీవ్రంగా పరిగణించిన భారత్, దిల్లీలోని యూఎస్ దౌత్యవేత్తకు సమన్లు జారీ
చేసింది. దీంతో అమెరికా రాయబార కార్యాలయం తాత్కాలిక డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్
గ్లోరియా బెర్బేనారం విదేశాంగ శాఖ అధికారులతో సమావేశమై వివరణ ఇచ్చారు.
భారత
న్యాయ ప్రక్రియలు స్వతంత్ర న్యాయవ్యవస్థపై ఆధారపడి ఉంటాయన్న విదేశాంగ శాఖ, ఇందులో
కచ్చితమైన, సమయానుకూల ఫలితాలు వస్తాయి. దీనిపై
అంచనాలు వేయడం సరికాదు అని అగ్రరాజ్యానికి హితువు పలికింది. విదేశాంగశాఖ స్పష్టంగా చెప్పింది.
దౌత్య
సంబంధాల్లో ఆయా దేశాలు ఇతరుల సార్వభౌమాధికారం, అంతర్గత
వ్యవహారాలను గౌరవించాలని మేం భావిస్తున్నామని తెలిపింది.
కేజ్రీవాల్
అరెస్టుపై ఈ-మెయిల్లో అడిగిన ఓ ప్రశ్నకు అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి
స్పందించారు. భారత్లోని ప్రతిపక్ష నేత అరెస్టుకు సంబంధించిన నివేదికలను నిశితంగా
పరిశీలిస్తున్నామని, పారదర్శక విచారణను
ప్రోత్సహిస్తున్నామని జవాబు ఇచ్చారు.
అంతకుముందు
జర్మనీ విదేశాంగశాఖ కూడా ఇదే విధంగా స్పందించింది. భారత్ ప్రజాస్వామ్య దేశమన్న
జర్మనీ, ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ న్యాయపరమైన, నిష్పాక్షికమైన విచారణకు అర్హులని
పేర్కొంది. ఆ దేశ రాయబారికి కూడా భారత్ సమన్లు జారీ చేసింది. తమ అంతర్గత వ్యవహారాల్లో
జోక్యం సరికాదని తేల్చి చెప్పింది.