ఆధ్మాత్మిక
పుస్తకాలు ముద్రించి, విక్రయించే గీతాప్రెస్, టెక్నాలజీని మెరుగుపరుచుకుంటుంది.
యూపీలోని
గోరఖ్‌పూర్ గీతా ప్రెస్ యాజమాన్యం,
జపాన్ నుంచి భారీ యంత్రాన్ని కొనుగోలు చేసింది. దీని ద్వారా అత్యంత వేగంగా
పుస్తకాలు ముద్రించవచ్చు. మరో 10
రోజుల్లో ఈ యంత్రం పని ప్రారంభించనుంది. బెంగళూరు నుంచి తీసుకువచ్చిన వెల్‌వూండ్
మెషీన్‌ను కూడా ఇక్కడ వినియోగించనున్నారు. ఈ యంత్రంతో బైడింగ్ పనులు వేగవంతం
కానున్నాయి.
జపాన్
నుంచి తెచ్చిన కొమోరీ మెషిన్ సాయంతో కలర్ ప్రింటింగ్ పనులు కూడా వేగంగా జరుగుతాయి.
యంత్రం ద్వారా ఒక గంటలో 15 వేల కలర్ పేజీలను ముద్రించే అవకాశం
ఉంది.
గీతా
ప్రెస్, పలు భాషల్లో ఆధ్యాత్మిక పుస్తకాలను ప్రచురిస్తుంది. ప్రతీరోజూ దాదాపు 70 వేల పుస్తకాలు ముద్రిస్తారు.