ఛత్తీస్గఢ్
లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా పరిధిలోని చికుర్బత్తి, పుస్బాక అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు
జరిగాయి. ఘటనలో ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
మావోయిస్టుల
కదలికలపై పక్కా సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు. మిగతా మావోయిస్టుల
కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
మృతి చెందిన
మావోయిస్టులో ఓ మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మావోయిస్టుల డంప్ లో భారీగా
మందుగుండు సామగ్రి, ఆయుధాలను గుర్తించి స్వాధీనం
చేసుకున్నారు. గతంలో ఈ ప్రాంతంలోనే ముగ్గురు స్థానికులను మావోలు హతమార్చారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు