ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ రెండో విజయాన్ని సాధించింది. చెన్నైలోని
చెపాక్ మైదానం వేదికగా మంగళవారం రాత్రి గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్ లో 63
పరుగుల తేడాతో విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు
నష్టపోయి 206 పరుగులు చేయగా లక్ష్య ఛేదనలో గుజరాత్
బ్యాటర్లు ఘోరంగా విఫలమ్యారు.
నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 143 పరుగులు మాత్రమే చేసి ఓటమిని మూటగట్టుకున్నారు.
మ్యాచ్ ఆరంభంలోనే కెప్టెన్ శుభ్‌మాన్ గిల్(8)ను చెన్నై పేసర్
దీపక్ చాహర్ పెవిలియన్ కు పంపగా, 5వ ఓవర్లో మరో
ఓపెనర్ వృద్ధిమాన్ సాహా(21) కూడా చాహర్ బౌలింగ్
లోనే వెనుదిరిగాడు. సాయి సుదర్శన్( 37) వద్ద ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు.
చెన్నై
బౌలర్లలో దీపక్ చాహర్, ముస్తాఫీజుర్ రెహ్మాన్, తుషార్
దేశ్ పాండే తలా రెండు వికెట్లు, డారిల్ మిచెల్, మతీష
పతిరణ చెరోక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.