రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి స్మరణానంద శివైక్యం చెందారు. మంగళవారం రాత్రి 8 గంటల 14 నిమిషాలకు ఆయన నిర్యాణం చెందారు. 94 ఏళ్ల స్మరణానంద, ఈ విషయాన్ని రామకృష్ణ మిషన్ –బేలూరు సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రకటించింది. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో శ్రీ స్మరణానంద తుది శ్వాస విడిచారని తెలిపింది.
కోల్‌కతాలోని రామకృష్ణ మిషన్ సేవా ప్రతిష్ఠాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్‌తో జనవరి 29న హాస్పిటల్‌లో చేరిన స్మరణానంద, ఆ తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. దీంత మార్చి 3 నుంచి వెంటిలేటర్‌పై ఉంచారు.
స్మరణానంద నిర్యాణం పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. స్మరణానంద మహారాజ్ తన జీవితాన్ని ఆధ్యాత్మికత, సేవకు అంకితం చేశారని కొనియాడారు. స్మరణానంద అంకితభావం, విజ్ఞానం తరతరాలకు స్ఫూర్తినిస్తాయన్నారు. 2020లో తాను బేలూరు మఠాన్ని సందర్శించానని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు.