అనకాపల్లి లోక్సభ
స్థానానికి వైసీపీ, తన అభ్యర్థిని ప్రకటించింది. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు
పోటీలో ఆ పార్టీ ప్రకటించింది. వైసీపీ 175 అసెంబ్లీ, 24 ఎంపీ స్థానాలకు
గతంలో అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ తాజాగా అనకాపల్లి ఎంపీ స్థానానికి అభ్యర్థిని
ప్రకటించింది.
ముత్యాలనాయుడు
ప్రస్తుతం మాడుగుల నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
అనకాపల్లి ఎంపీ
స్థానానికి ఆయనను పోటీలోకి దింపుతున్న వైసీపీ అధిష్టానం, మాడుగుల ఎమ్మెల్యే టికెట్
ను ఈర్లి అనురాధకు ఇచ్చారు. ముత్యాలనాయుడు కూమార్తె అనురాధ. బూడి ముత్యాలనాయుడుది
కొప్పుల వెలమ సామాజికవర్గం.
ఎన్డీయే తరఫున బీజేపీ అభ్యర్థిగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ బరిలోకి దిగనున్నారు. కడప జిల్లాకు చెందిన సీఎం
రమేశ్, టీడీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. టీడీపీ లో పలు పదవులు నిర్వహించారు.
టీడీపీ తరఫున గతంలో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2019లో టీడీపీ ఓటమి తర్వాత బీజేపీలో
చేరారు.