బెట్టింగ్ వ్యసనాలు కుటుంబాలను బలితీసుకుంటున్నాయి. తాజాగా క్రికెట్ బెట్టింగ్‌లో దర్శన్ బాబు అనే ఇంజనీర్ కోటి రూపాయలు పోగొట్టుకున్నాడు. బెట్టింగ్ కోసం తెలిసిన వారందరి వద్దా అప్పులు చేశాడు. అప్పులిచ్చిన వారు ఇంటిపైకి గొడవకు రావడంతో విసిగిపోయిన ఇంజనీర్ భార్య రంజిత ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.
దర్శన్‌బాబు కర్ణాటక ప్రభుత్వంలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. గడచిన మూడేళ్లుగా క్రికెట్ బెట్టింగులకు అలవాటు పడ్డాడు. అతను సంపాదించుకునే జీతంతోపాటు, బంధువుల వద్ద పెద్ద మొత్తంలో అప్పులు చేశాడు. అవన్నీ వడ్డీలు పెరిగిపోయాయి. అప్పుల వారి ఒత్తిడి పెరిగిపోవడం, అప్పులిచ్చిన వారు ఇంటిపైకి దాడికి రావడంతో విసిగిపోయిన ఇంజనీర్ భార్య రంజిత చిత్రదుర్గలో ఆత్మహత్య చేసుకుంది.
వడ్డీ వ్యాపారుల ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఇంజనీర్ భార్య రంజిత ఓ సూసైడ్ నోట్ రాసింది. దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.