టీచర్స్
రిక్రూట్మెంట్ స్కామ్ లో పశ్చిమబెంగాల్ మంత్రి చంద్రనాథ్ సిన్హాకు ఈడీ తాఖీదులు
జారీ చేసింది. మార్చి 27న విచారణకు హాజరుకావాలని నోటీసులో ఈడీ పేర్కొంది.
బోల్పూరులోని మంత్రి చంద్రనాథ్ సిన్హా
నివాసంలో మార్చి 22న ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. పలు ఆస్తి పత్రాలతో పాటు మొబైల్
ఫోన్, 40 లక్షల రూపాయల నగదును ఈడీ అధికారులు సీజ్ చేశారు.
పెద్ద మొత్తంలో నగదు
పట్టుబడటంపై ఇంతవరకు వివరణ ఇవ్వని చంద్రనాథ్ సిన్హా, సోదాలు జరిగే సమయంలో బోల్పూరుకు
90 కిలో మీటర్ల దూరంలోని పూర్వీకుల గ్రామం మురారైలో ఉన్నారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు