Smriti Irani counters baseless allegations of Jairam
Ramesh
ఎన్డీయే ప్రభుత్వ మహిళా సమాజానికి చేసిందేమీ
లేదంటూ కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ చేసిన ఆరోపణల మీద కేంద్ర మహిళా శిశుసంక్షేమ
శాఖ మంత్రి స్మృతీ ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేసారు. యూపీయే పదేళ్ళ కాలానికీ, ఎన్డీయే
పదేళ్ళ కాలానికీ తేడా వివరిస్తూ గణాంకాలు విడుదల చేసారు.
కాంగ్రెస్ నాయకుల ఆరోపణలను తిప్పి కొట్టే
క్రమంలో స్మృతీ ఇరానీ గాంధీ కుటుంబంపై విరుచుకుపడ్డారు. ‘ఎన్నో యేళ్ళనుంచీ
దేశానికి తామే అసలైన వారసులమంటూ చెప్పుకొంటున్న కుటుంబీకులు దేశ సంపదను
దోచుకున్నారు. పార్టీ పతనమైనప్పటికీ, వారి అనుచరులు వాస్తవాలను వక్రీకరిస్తూనే
ఉన్నారు. మహిళా సంక్షేమం కోసం భాజపా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను
అణగదొక్కడానికి గణాంకాలను తారుమారు చేస్తున్నార’ని ఆగ్రహం వ్యక్తం చేసారు.
కాంగ్రెస్ పార్టీ తాజాగా ఎన్డీయే హయాంలో మహిళాశిశు సంక్షేమ శాఖ భారీ వైఫల్యాల పేరిట ఒక జాబితా విడుదల
చేసింది. ‘దేశమంతటా మహిళలపై దాడులు జరుగుతున్నప్పుడు మంత్రి స్మృతీ ఇరానీ మౌనంగా
ఉండి, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో నేరాలకు మాత్రమే
మేల్కొంటారు. తన మంత్రిత్వశాఖ నిధులను మళ్లిస్తున్నారు’ అంటూ జైరాం రమేష్ తీవ్ర
విమర్శలు చేశారు.
జైరాం వ్యాఖ్యలకు స్మృతీ ఇరానీ తీవ్రంగా స్పందించారు.
మహిళల భద్రత కోసం యూపీఏ ప్రభుత్వ హయాంలో ‘నిర్భయ ఫండ్’ ఏర్పాటు చేసినా దానికి
అసలు రూపాయి కూడా కేటాయించలేదని వివరించారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన
తర్వాత దేశ వ్యాప్తంగా 40 ప్రాజెక్టులు రూపొందించినట్లు చెప్పారు.
‘2023-24 నాటికి మొత్తం రూ.7212.85కోట్లు
కేటాయించగా ప్రస్తుతం వీటిలో 75శాతం ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర
ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాల కోసం వినియోగించాము’ అని వెల్లడించారు.
నిర్భయ కాల్ సెంటర్లు, వన్‌స్టాప్
సెంటర్లు, ప్రతి పోలీస్‌స్టేషన్‌లో మహిళా హెల్ప్ డెస్క్‌లు,
ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మహిళలకు నిరంతరం అందుబాటులో ఉంటున్నాయని మంత్రి
స్మృతీ ఇరానీ పేర్కొన్నారు. అంగన్వాడీలకు గౌరవ వేతనాన్ని అందించామన్నారు. ఆన్లైన్లో
డేటా అప్డేట్ చేసేందుకు రూ.2,000 అదనంగా ఇస్తున్నామని తెలిపారు. ఆయుష్మాన్ భారత్,
పీఎం జీవన జ్యోతి, సురక్ష బీమా యోజన వంటి సంక్షేమ పథకాలు
అందిస్తున్నామన్నారు. మోదీ ప్రభుత్వం స్త్రీలను ఓటు బ్యాంకుగా కాకుండా దేశ పురోగతికి
మార్గదర్శకులుగా భావిస్తోందన్నారు.
బీజేపీ ఐదు భారీ వైఫల్యాలుగా కాంగ్రెస్ పేర్కొన్న
వాటిలో మహిళలుబాలికలపై నేరాల రెట్టింపు, అంగన్వాడీ
ఆశావర్కర్లకు తక్కువ వేతనాలు, మహిళలు-బాలికల్లో రక్తహీనత పెరుగుదల, పెరిగిన
నిరుద్యోగ మహిళల సంఖ్య ఉన్నాయి.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు