దిల్లీ
లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి ఎదురుదెబ్బ
తగిలింది. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను రౌస్ అవెన్యూ కోర్టు పరిగణనలోకి
తీసుకోలేదు.14 రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం, కవితను తిహార్ జైలుకు తరలించాలని
ఆదేశించింది. ఏప్రిల్ 9 వరకు రిమాండ్ విధించింది. కవిత బెయిల్
పిటిషన్ పై ఏప్రిల్ 1న విచారణ జరుపతామని స్పష్టం చేసింది.
తన
కుమారుడికి పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును కవిత కోరగా
దర్యాప్తు లో భాగంగా మళ్ళీ కస్టడీకి ఇవ్వాలని
ఈడీ కోరినప్పటికీ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. మధ్యంతర బెయిల్ పిటిషన్ పై
ఏప్రిల్ 1న విచారణ చేపడతామని వెల్లడించింది.
తన
పై తప్పుడు కేసు పెట్టారని కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు హాలులోకి
వెళ్ళడానికి ముందు మీడియాతో మాట్లాడుతూ తన పై పెట్టిన కేసు మనీలాండరింగ్ కేసు
కాదని పొలిటికల్ లాండరింగ్ కేసు అంటూ వ్యాఖ్యానించారు. కేసు నుంచి కడిగిన ముత్యంలా
బయటకు వస్తానని చెప్పారు. ‘‘నన్ను తాత్కాలికంగా జైలు లో పెట్టవచ్చు, కానీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు’’ అని అన్నారు.