ప్రముఖనటి కంగనా రనౌత్‌పై లైంగిక ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనతేపై జాతీయ మహిళా హక్కుల కమిషన్ సీరియస్ అయింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ నటి కంగనా రనౌత్ పేరు ప్రకటించగానే ఆమెపై కాంగ్రెస్ నేత సుప్రీయా శ్రీనతే సంచలన వ్యాఖ్యలు చేశారు. చర్యలు తీసుకోవాలంటూ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు అందడంతో వెంటనే రంగంలోకి దిగింది. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించింది.
కాంగ్రెస్ నేత సుప్రీయ చేసిన పోస్టుపై బీజేపీ వర్గాలు భగ్గుమన్నాయి. వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను డిమాండ్ చేశారు. మహిళ గౌరవానికి భంగం కలిగితే సహించేది లేదని బీజేపీ నేతలు తేల్చి చెప్పారు. యువకులకు టికెట్ ఇస్తే సిద్దాంతాలను ఎత్తిచూపుతారు. అదే మహిళకు టికెట్ ఇస్తే లైంగిక ఆరోపణలకు దిగుతున్నారని బీజేపీ నేతలు విమర్శించారు. ఇలాంటి ధోరణి సిగ్గుచేటని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తప్పుపట్టారు. కంగనాకు ఆమె మద్దతుగా నిలిచారు.