విశాఖ డ్రగ్స్ కంటెయినర్ కేసు
చిక్కుముడి వీడకపోగా రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటుంది. సంధ్వా ఆక్వా ఎక్స్పోర్ట్స్
కంపెనీ చుట్టూ ఈ కేసు తిరుగుతోంది. తాజాగా ఓ విదేశీయుడు ఆ కంపెనీ నుంచి వెళుతూ
నగదుతో పోలీసుల తనిఖీలో దొరికాడు. అంతకుముందు రోజు కంపెనీ పేరుతో ఉన్న ఓ బస్సును
రోడ్డుపై నిలిపివేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.
సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ పరిశ్రమకు
వచ్చి వెళుతూ ఓ విదేశీయుడు నగదుతో తనిఖీల్లో పట్టుబడ్డాడు. కాకినాడ జిల్లా
యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ ప్రధాన కూడలిలో పోలీసులు ఎన్నికల కోడ్ లో భాగంగా
తనిఖీలు నిర్వహించారు. ఓ కారులో వియాత్నం జాతీయుడైన ఓ వ్యక్తి వద్ద రూ.1.30 లక్షలు లభించాయి. దీంతో పోలీసులు అతడిని ప్రశ్నించారు.
పోలీసులకు ఏం సమాధానం చెప్పాలో తెలియక సంధ్యా ఆక్వా కంపెనీ ప్రతినిధులకు అతడు ఫోన్
చేశాడు. అతని పేరు టాంగ్ అని, వియత్నాం దేశస్థుడని తెలిసింది. తమ కంపెనీ
నుంచి మిషనరీ అందజేస్తామని, వాటి మరమ్మతుల నిమిత్తమే సంధ్యా పరిశ్రమకు వచ్చినట్లు
టాంగ్ తెలిపాడు.
మూడు గంటల తర్వాత ఆక్వా పరిశ్రమ
ప్రతినిధులు అక్కడికి చేరుకుని వివరణ ఇచ్చారు. ఫ్లయింగ్ స్క్వాడ్ నారాయణదాసు
ఉప్పాడకు చేరుకుని విదేశీయుడికి సంబంధించిన పత్రాలు, పాస్పోర్టు పరిశీలించారు.
అనంతరం సంధ్య పరిశ్రమ ప్రతినిధుల నుంచి హామీ పత్రం తీసుకుని విడిచిపెట్టారు. ఈ విషయంపై
వివరణ ఇచ్చేందుకు సంధ్యా ఆక్వా పరిశ్రమ
యాజమాన్యం నిరాకరించింది.
అంతకుముందు రోజు కొత్తమూల పేట సెజ్
కాలనీలో ఆదివారం నాడు సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్కు
చెందిన ఓ బస్సు అనుమానాస్పదంగా నిలిపిఉంచడం కలకలం రేపింది. మూడు రోజులుగా అక్కడే
బస్సును నిలిపిఉన్నట్లు తెలిసింది.
విశాఖ పోర్టుకు బ్రెజిల్ నుంచి ఈ నెల 16న
వచ్చిన కంటెయినర్ లో భారీగా డ్రగ్స్ ఉండటాన్ని సీబీఐ గుర్తించింది. సంధ్యా ఆక్వా
పరిశ్రమ పేరిట ఆ కంటెయినర్ విశాఖ చేరుకోవడంతో సీబీఐ అధికారులు సోదాలు
నిర్వహించారు.
ఈ క్రమంలో బస్సులో పెద్దమొత్తంలో బిల్స్, బ్యాంకు రికార్డులు, చెక్
బుక్కులు, ఇతర పత్రాలు ఉంచారా అనే అనుమానాలకు తావిస్తోంది. అయితే బస్సు మరమ్మతులకు గురవడంతో
అక్కడ నిలిపివేయాల్సి వచ్చిందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
తనిఖీలు నిర్వహించిన పోలీసులు అందులోని
ఫైల్స్ ను పరిశీలించారు. విచారణ అనంతరం బస్సును కంపెనీ యాజమాన్యానికి అప్పగించారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు