ఖలిస్థాన్ ఉగ్రసంస్థ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.133 కోట్ల నిధులు అందాయని గురుపత్వంత్ సింగ్ పన్నూ సంచలన విషయాలను వెల్లడించాడు.ఖలిస్థాన్ ఉగ్రవాది దేవీందర్ పల్సింగ్ భుల్లర్‌ను జైలు నుంచి విడుదల చేయాలంటే ఆమ్ ఆద్మీ పార్టీకి నిధులు సమకూర్చాలని 2014లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రతిపాదించినట్లు పన్నూ ఆరోపించారు. అమెరికాలోని న్యూయార్క్ సమీపంలోని రిచ్మండ్ గురుద్వారాలో జరిగిన ఓ సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చినట్లు పన్నూ గుర్తుచేశారు.
1993 ఢిల్లీ బాంబుపేలుడు కేసులో భుల్లర్ శిక్ష అనుభవిస్తున్నాడు. కేజ్రీవాల్ ఇచ్చిన ప్రతిపాదనపై.. పన్నూ విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో కూడా పన్నూ కేజ్రీవాల్‌పై పలు ఆరోపణలు చేశాడు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు