How can Kejriwal issue orders to AAP while in ED custody?
తమ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్
కేజ్రీవాల్, ఆదేశాలు జారీ చేశారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు చెప్పడాన్ని ఎన్ఫోర్స్మెంట్
డైరెక్టరేట్ తీవ్రంగా పరిగణించింది. ఆప్ మంత్రి ఆతిశీని ప్రశ్నించడంతో సహా
కేజ్రీవాల్ కదలికల సీసీటీవీ దృశ్యాలను పరిశీలించేందుకు సిద్ధపడుతోంది.
ఈడీ కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్
కేజ్రీవాల్ తమకు ఆదేశాలు జారీ చేసారంటూ మంత్రి ఆతిశీ మార్లీనా ఆదివారం మీడియా
సమావేశంలో చెప్పుకొచ్చారు. ఆ సందర్భంలో కేజ్రీవాల్ పంపించిన ఆదేశాలు అంటూ ఒక కాగితాన్ని
కూడా ప్రదర్శించారు.
ఆ విషయాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
తీవ్రంగా పరిగణించింది. కస్టడీ సమయంలో తమ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌కు
తాము ఎలాంటి వస్తువులూ ఇవ్వలేదని చెబుతోంది. కంప్యూటర్ లేదా కాగితాలు లేకుండా
కేజ్రీవాల్, తమ పార్టీకి ఆదేశాలు ఎలా జారీ చేసారో తెలుసుకోడానికి ప్రయత్నిస్తోంది.
సదరు ఆదేశాలు బైటకు ఎలా వెళ్ళాయన్న విషయం కూడా తెలుసుకోడానికి చర్యలు చేపట్టింది.
ఆ క్రమంలోనే, కేజ్రీవాల్ తమకు
ఆదేశాలు జారీ చేసారని ప్రకటించిన మంత్రి ఆతిశీపై ఈడీ దృష్టి సారించింది. ఆ ఆదేశాల
కాగితం ఆమెకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకొనేందుకు ఆతిశీని ఈడీ ప్రశ్నించవచ్చు.
అలాగే, జైల్లో కేజ్రీవాల్ కదలికలను గమనించేందుకు సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా
పరిశీలించే అవకాశముందని తెలుస్తోంది.