కామరాజ్ నిద్రపోతున్నప్పుడు చంపాలని చూసింది మీరు కాదా అంటూ తమిళనాడు మత్స్యశాఖ మంత్రి అనితా ఆర్ రాధా కృష్ణన్ ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది. ప్రధాని మోదీని కించపరిచేలా మంత్రి చేసిన ఆరోపణలపై బీజేపీ నేతలు మెగ్ననపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంత్రిపై 294 బి సెక్షన్ కింద అంటే బహిరంగంగా అసభ్య పదజాలం ఉపయోగించడం కింద కేసు నమోదైంది. మంత్రిపై చర్యలు తీసుకోవాలని తమిళనాడు బీజేపీ నేతలు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
డీఎంకే నాయకులు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నీచమైన, క్షమించరాని వ్యాఖ్యలు చేశారని, వారి అసభ్య ప్రవర్తన పతాకస్థాయికి చేరుకుందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సమయంలో డీఎంకే ఎంపీ కనిమొళి పక్కనే ఉన్నా కనీసం ఆపే ప్రయత్నం చేయలేదని అన్నామలై తప్పుపట్టారు.
తమిళనాడు మాజీ సీఎం కె.కామరాజ్ నిజాయితీ, ఆయన ప్రవేశపెట్టిన మధ్యాహ్నం భోజనం పథకం తనకు స్ఫూర్తినిచ్చాయని ఇటీవల సేలంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కామరాజ్ మిమ్మల్ని కౌగిలించుకునట్లుగా మాట్లాడుతున్నారంటూ ప్రదాని మోదీపై మంత్రి అనితా ఆర్ రాధాకృష్ణన్ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదంగా మారాయి.
గతంలోనూ మంత్రి అనితా ఆర్ రాధాకృష్ణన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. షార్ కేంద్రంలో రెండో లాంచ్ ఫ్యాడ్‌ను సిద్దం చేయడాన్ని ప్రశంసిస్తూ దానిపై చైనా జెండా బొమ్మతో ఎక్స్‌లో పోస్ట్ చేసి వివాదానికి తెరలేపారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు