Surendran to fight against Rahul Gandhi
ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీని వదిలిపెట్టేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఈసారి కూడా
కేరళలోని వేనాడ్ నుంచే ఎన్నికల బరిలో నిలబడుతున్నారు. ఆయనకు పోటీగా బీజేపీ, తమ
కేరళ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కె సురేంద్రన్‌ను దింపుతోంది.
వేనాడ్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 2009 నుంచి అక్కడ కాంగ్రెస్ బలంగా
ఉంది. 2019లో రాహుల్ గాంధీ ఆ స్థానం నుంచి పోటీ పడి, తన లోక్‌సభా స్థానాన్ని
రక్షించుకున్నారు. సాంప్రదాయికంగా తమ కుటుంబం పోటీ చేసే అమేఠీ స్థానంలో రాహుల్
గాంధీ 2019లో బీజేపీ అభ్యర్ధి స్మృతీ ఇరానీ చేతిలో ఓడిపోయారు.
వేనాడ్‌లో రాహుల్ గాంధీ ప్రత్యర్ధిగా బీజేపీ
తరఫున ఎం శ్రీధరన్ బరిలోకి దిగుతున్నారు. వేనాడ్‌లో సాధారణంగా కాంగ్రెస్-వామపక్షాల
ఆధిక్యం ఎక్కువ. ఆ రెండింటికీ జాతీయస్థాయిలో పొత్తు ఉన్నప్పటికీ కేరళలో మాత్రం
ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. అందువల్ల వేనాడ్‌లో ఆ రెండు పార్టీల మధ్యా
స్నేహపూర్వక పోటీ ఉండవచ్చు. అది బీజేపీకి లాభించే అవకాశాలూ ఉన్నాయి.
బీజేపీ అభ్యర్ధి కె సురేంద్రన్ కోళికోడ్
(కళ్ళికోట) ప్రాంతానికి చెందినవారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పత్తనంతిట్ట
నియోజకవర్గం నుంచి పోటీచేసి మూడో స్థానంలో నిలిచారు. 2016 కేరళ శాసనసభ ఎన్నికల్లో
మంజేశ్వరం నియోజకవర్గం నుంచి కేవలం 89 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019లో ఒక
ఉపయెన్నికలో కూడా పోటీ చేసి ఓడిపోయారు. 2020లో సురేంద్రన్, కేరళ బీజేపీ
అధ్యక్షుడిగా నియమితులయ్యారు. శబరిమల ఉద్యమం సమయంలో ఆయన పార్టీని ముందుండి నడిపించారు.
తిరువనంతపురంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మీద
కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పోటీ పడుతున్నారు. అలాగే ఎర్నాకులంలో శ్రీశంకర
సంస్కృత విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ కెఎస్ రాధాకృష్ణన్‌ను బరిలోకి
దింపింది. నటుడు జి కృష్ణకుమార్ కొల్లం నుంచి, మాజీ విద్యావేత్త టిఎన్ సరసు
అళత్తూర్ నుంచి బీజేపీ తరఫున లోక్‌సభ ఎన్నికల బరిలో నిలబడ్డారు.
బీజేపీ ఐదవ జాబితాలో మరికొన్ని కొత్తముఖాలకు చోటు
దక్కింది. సినీనటి కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ నుండి ఎన్నికల్లో పోటీ
చేస్తారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, గతంలో కాంగ్రెస్‌లో ఉన్న నవీన్ జిందాల్ హర్యానాలోని కురుక్షేత్ర నుంచి పోటీ పడుతున్నారు.
ఇక పశ్చిమబెంగాల్‌లో కొద్దిరోజుల క్రితమే
వీఆర్ఎస్ తీసుకుని బీజేపీలో చేరిన అభిజీత్ గంగోపాధ్యాయ, రాజకీయ రంగంలోకి
ప్రవేశిస్తున్న దేశంలోని మొట్టమొదటి రైతు అనుకూలవాది.
అలాగే టీవీ రాముడు అరుణ్ గోవిల్ ఉత్తరప్రదేశ్‌లోని
మీరట్ నుంచి నిలబడుతున్నారు. ఇక కేంద్రమంత్రివర్గంలో మంత్రులుగా ఉన్న
అశ్వినీకుమార్ చౌబే, జనరల్ వీకే సింగ్‌లకు ఈ జాబితాలో చోటు దక్కలేదు.