సందేశ్‌ఖాలీలో బాధితులకు అండగా నిలిచిన మరో బాధితురాలికి బసిర్హాట్ పార్లమెంటు సీటు వరించింది. పశ్చిమ బెంగాల్‌లోని బసిర్హాట్ పార్లమెంట్ స్థానంలో రేఖకు బీజేపీ టికెట్ కేటాయించింది. సందేశ్‌ఖాలీలో షాజహాన్, అతని అనుచరుల అరాచకాలను అడ్డుకుని గళమెత్తిన మహిళగా రేఖకు మంచి గుర్తింపు వచ్చింది.బీజేపీ నేతలు కూడా ఆమెకు అండగా నిలిచారు. బీజేపీ ఆదివారం 111 మంది అభ్యర్థులతో ఐదో జాబితా ప్రకటించింది. ఆ జాబితాలో రేఖకు కూడా స్థానం దక్కింది.
సందేశ్‌ఖాలీలో బాధితులకు రేఖ అండగా నిలిచారు. అక్కడ జరుగుతున్న అరాచకాలను వెలుగులోకి తీసుకురావడంలో రేఖ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోయింది. ఇటీవల ప్రధాని బరసత్ పర్యటనలోనూ రేఖ కీలకంగా వ్యవహరించారు. సందేశ్‌ఖాలీ బాధితులతో ప్రధాని సమావేశం ఏర్పాటు చేయించారు. అనూహ్యంగా బీజేపీ ఐదో జాబితాలో రేఖ పేరు రావడంతో ఒక్కసారిగా ఆమె మరోసారి వార్తలో నిలిచారు.