పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ను భారతదేశంలో విలీనం చేయాలంటూ ఆ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో పీవోకే ప్రాంతం భారత్‌లో విలీనం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.పీవోకేపై దాడి చేసి ఆక్రమించుకోవాల్సిన అవసరం తమకు లేదని, అక్కడి ప్రజల డిమాండ్ల మేరకు భవిష్యత్తులో భారత్‌లో విలీనం అయ్యే అవకాశముందన్నారు.
హోలీ పండుగ సందర్భంగా ప్రపంచంలోనే అతి ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాసిన్లో సైనికులతో ఆయన సరదాగా గడిపారు. దేశానికి ఢిల్లీ రాజధాని, ఆర్థిక రాజధాని ముంబై మాదిరి, లద్దాఖ్ మన శౌర్యానికి రాజధాని అని గుర్తు చేశారు. హోలీ పండుగను సైనికులతో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. అనేక కార్యక్రమాలను రద్దు చేసుకుని సియాచిన్ ప్రాంతంలో సైనికులతో కలసి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ హోలీ వేడుకలు జరుపుకున్నారు.