BJP releases 5th list of 111 candidates
లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ 111 మంది అభ్యర్థులతో కూడిన ఐదవ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పలువురు ప్రముఖులతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. బాలీవుడ్
నటి కంగనా రనౌత్‌ను హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ నుంచి లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించింది.
5వ లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో కంగనా
రనౌత్‌తో పాటు నవీన్ జిందాల్, మనేకా గాంధీ తదితర ప్రముఖుల పేర్లు
ఉన్నాయి. ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లో 6, బిహార్‌లో 17,
సిక్కిం, మిజోరాం, గోవాలో ఒక్కో సీటు, గుజరాత్లో 6 సీట్లు, హర్యానాలో 4, హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణలో రెండేసి సీట్లు, మహారాష్ట్రలో
మూడింటికి అభ్యర్థుల పేర్లు వెల్లడించింది. జార్ఖండ్, కేరళ, కర్ణాటకలో నాలుగు, ఒడిశాలో 21, రాజస్థాన్‌లో 7, ఉత్తరప్రదేశ్‌లో 13, పశ్చిమ బెంగాల్లో 19 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది.
ఆ జాబితాలో తెలంగాణలోని రెండు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.
వరంగల్ (ఎస్సీ) స్థానానికి ఆరూరి రమేష్, ఖమ్మం ఎంపీ
స్థానానికి వినోద్ రావు పేర్లను ఖరారు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేనతో పొత్తులో భాగంగా బీజేపీ 6 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ
చేయనుంది. ఆ ఆరు ఎంపీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించింది. ఇంక అసెంబ్లీ
అభ్యర్ధులను నిర్ణయించాల్సి ఉంది.
కంగనా రనౌత్ 2024 లోక్‌సభ ఎన్నికలలో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి స్థానం
నుంచి పోటీ చేయనుండగా, రామాయణం ఫేమ్ అరుణ్ గోవిల్ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్
నుంచి పోటీ చేయనున్నారు. ఇక, ఆదివారమే బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత నవీన్ జిందాల్‌కు హర్యానాలోని కురుక్షేత్ర టికెట్ దక్కింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిభిత్ లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న
వరుణ్ గాంధీకి టికెట్ దక్కలేదు. అతని స్థానంలో యూపీ మంత్రి జితిన్
ప్రసాదను బరిలో నిలుపుతోంది. అయితే వరుణ్ తల్లి మేనకా గాంధీకి మాత్రం ఉత్తరప్రదేశ్‌లోని
సుల్తాన్పూర్ టికెట్ ఇచ్చారు.