హోలీ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ దేవాలయంలో చెలరేగిన మంటల్లో 14 మంది పూజారులు తీవ్రంగా గాయపడ్డారు. గర్భాలయంలో బస్మా హారతి ఇస్తున్న సమయంలో ఈ ఘోరం జరిగింది. హోలీ సందర్భంగా ఏటా ప్రత్యేక పూజలు నిర్వహించి, పెద్ద ఎత్తున హారతులు ఇస్తుంటారు.దేవాలయం లోపల మంటలు చెలరేగడంతో పూజారులు తప్పించుకోలేకపోయారు. తీవ్రంగా గాయపడిన పూజారులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాద కారణాలను కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రుల్లో చేర్పించి, చికిత్స అందిస్తున్నట్లు ఉజ్జయిని జిల్లా కలెక్టర్ నీరజ్ సింగ్ తెలిపారు. గాయపడిన వారిలో పూజారులతోపాటు, కొందరు దేవాలయ సిబ్బంది కూడా ఉన్నారు. ప్రధాన పూజారి
సంజయ్ గురు కూడా గాయపడ్డారు. ఆయన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.