టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో భాగంగా ఆయా పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. తాజాగా బీజేపీ కూడా బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను ఢిల్లీలో మీడియాకు విడుదల చేసింది. తిరుపతి పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీకి రాజీనామా చేసిన వరప్రసాద్ పోటీ చేయనున్నారు. రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, రాజమండ్రి నుంచి ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి, అరకు నుంచి మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, నరసాపురం నుంచి ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసవర్మ బరిలో నిలవనున్నారు.
విజయనగరం విషయంలో చివరి వరకు సస్పెన్స్ కొనసాగింది. పొత్తులో భాగంగా బీజేపీకి ఇవ్వాలని టీడీపీ భావించింది. అయితే ఆ సీటు టీడీపీకి ఇచ్చి రాజంపేటలో బీజేపీ అభ్యర్థిగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ప్రకటించారు. తిరుపతిలో ఆఖరి క్షణంలో బీజేపీలో చేరిన వరప్రసాద్ దక్కించుకున్నారు. నరసాపురం బరిలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుకు బీజేపీ టికెట్ దక్కుతుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా శ్రీనివాసవర్మ తెరమీదకు వచ్చారు.