విశాఖ తీరంలో డ్రగ్స్ పట్టుబడిన ఘటనలో తనపై
వస్తున్న ఆరోపణలను ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి తిప్పికొట్టారు. సంధ్యా ఎక్స్ పోర్ట్స్ సంస్థలో తాము
భాగస్వాములమంటూ సాక్షి మీడియా తప్పుడు
వార్తలు రాయడాన్ని ఆమె ఖండించారు. తన పరువుకు భంగం కలిగించారంటూ సాక్షి
మీడియా సంస్థకు పురందరేశ్వరి పరువునష్టం
నోటీసులు పంపించారు. రూ.20 కోట్లకు పరువునష్టం దావా వేస్తున్నట్టు తెలిపారు. పురందేశ్వరి
న్యాయవాది సతీశ్, సాక్షి యాజమాన్యానికి నోటీసులు పంపారు.
విశాఖ తీరానికి బ్రెజిల్ నుంచి వచ్చిన ఓ కంటైనర్ 25 వేల కిలోల నిషిద్ధ
డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించారు. అయితే,
ఈ కంటైనర్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ఈ డ్రగ్స్
తెప్పించిన కంపెనీ మీ వాళ్లదేనంటూ ఏపీ రాజకీయ పక్షాలు పరస్పరం ఆరోపించుకుంటున్నాయి.