ఉత్తరప్రదేశ్‌లోని మీరఠ్‌లో ఘోరం జరిగింది. ఫోన్ ఛార్జింగ్ పెట్టే సమయంలో మంటలు చెలరేగడంతో నలుగురు చిన్నారులు చనిపోయారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగాయని అనుమానిస్తున్నారు. ఆ మంటలు మంచంపై ఉండే దుప్పటికి అంటుకుని చిన్నారులు చనిపోయారు.
మృతుల్లో పదేళ్ల సారిక, ఎనిమిదేళ్ల నిహారిక, ఆరేళ్ల శంకర్, నాలుగేళ్ల కలు ఉన్నారు. వీరి తండ్రి కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పిల్లల తల్లికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు