వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగలింది.
ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా వైసీపీను వీడి కాంగ్రెస్ లో చేరారు.
హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో పీసీసీ చీఫ్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.
ఎలీజాకు పార్టీ కండువా కప్పి షర్మిల స్వాగతం పలికారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజాకు బదులు కంభం
విజయరాజుకు వైసీపీ టికెట్ కేటాయించింది. ఈ పరిణామంతో మనస్తాపం చెందిన ఎలీజా
కాంగ్రెస్ లో చేరారు.
గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ కూడా
వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆయన తిరుపతి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరఫున
రంగంలోకి దిగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే నందికొట్కూర్ ఎమ్మెల్యే ఆర్థర్
కూడా కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు కూడా ఈ దఫా వైసీపీ టికెట్ దక్కలేదు.