రష్యారాజధాని మాస్కోలో ఉగ్రదాడి కుట్రను స్థానిక పోలీసులు చేధించారు. కుట్రకు మేసేజింగ్ యాప్‌ను ఉపయోగించినట్లు తేలింది. కుట్రకు పాల్పడినవారిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. డబ్బులు, ఆయుధాలు ఇచ్చింది ఎవరో తెలియదని, తమకు మెసేజింగ్ యాప్ ద్వారా పరిచయం అయినట్లు నిందితులు చెప్పారు. సీసీ టీవీ వీడియోలు టీవీల్లో ప్రసారం కావడంతో, స్థానికుల సమాచారం మేరకు బ్రియన్క్స్ ప్రాంతంలో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
డబ్బు కోసమే కాల్పులు జరిపినట్లు దుండగులు అంగీకరించారు. 5 లక్షల రూబుళ్లను ఇందుకు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సగం మొత్తం ముట్టాయని బ్యాంకు ఖాతాల పరిశీలన ద్వారా వెల్లడైంది. తమకు డబ్బు, ఆయుధాలు సరఫరా చేసిన వారు ఎవరో తెలియదని నిందితులు చెప్పారు. కాల్పులు జరిపిన తరవాత తుపాకులు సమీపంలో పడేసి పరారయ్యారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.