ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మాజీ చీఫ్, ఆర్కేఎస్
భదౌరియా నేడు(ఆదివారం)కేంద్రమంత్రి
అనురాగ్ ఠాకూర్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బదౌరియా, సిట్టింగ్
ఎంపీ జనరల్ వీకే సింగ్ స్థానంలో ఘజియాబాద్ నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రచారం
జరుగుతుంది. భారతీయ వైమానిక దళం(IAF)లో భదౌరియా సుదీర్ఘ కాలం సేవలందించారని
బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే కొనియాడారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని
ఆగ్రాకు చెందిన రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా…1980లో భారత వాయుసేనలో
చేరారు. కీలక హోదాల్లో దేశానికి సేవలందించారు. భదౌరియా, ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా
ఉన్న సమయంలోనే ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి కీలక
చర్చలు జరిగాయి. భారత వాయుసేనలో దాదాపు 40 ఏళ్లు పాటు
సేవలందించారు.