తీవ్రవాద
భావజాలానికి ప్రభావితమైన ఐఐటీ- గువహాటి విద్యార్థి, నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్లో
చేరేందుకు సిద్ధమయ్యాడనే ఆరోపణలపై
పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అసోంలో
ఈ ఘటన చోటుచేసుకుంది. కమ్రూప్ జిల్లాలోని హజో సమీపంలో సదరు విద్యార్థిని పోలీసులు
అరెస్టు చేసి విచారిస్తున్నట్లు అసోం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జీపీ సింగ్
‘ఎక్స్’ వేదికగా తెలిపారు. చట్టపరంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
తమకు
వచ్చిన ఒక ఈ-మెయిల్లోని సందేశాన్ని నిర్ధారించిన తర్వాతే విద్యార్థిని అరెస్టు
చేసినట్లు అడిషనల్ ఎస్పీ(ఎస్టీఎఫ్) కల్యాణ్ కుమార్ పాఠక్ చెప్పారు. అరెస్టు
విషయాన్ని ఐఐటీ గువహాటి అధికారులకు తక్షణమే తెలియజేశామన్నారు.
అరెస్టయిన
విద్యార్థి ఢిల్లీలోని ఓఖ్లా ప్రాంతానికి చెందినవాడని, గువహాటి యూనివర్సిటీలో 4వ ఏడాది విద్యార్థిగా ఉన్నాడని
వెల్లడించారు.