గూడురు
ఎమ్మెల్యే వరప్రసాద్, వైసీపీని వీడి బీజేపీలో చేరారు. వచ్చే
ఎన్నికల్లో ఆయనకు వైసీపీ టికెట్ ఇవ్వలేదు. దీంతో దిల్లీ వెళ్లి బీజేపీలో చేరారు.
కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఆయనకు బీజేపీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.
బీజేపీ తరఫున తిరుపతి పార్లమెంటుకు పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది.
గూడూరు టికెట్ ను మేరుగ మురళీకి వైసీపీ అధిష్టానం కేటాయించింది.
దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న వరప్రసాద్, వైసీపీని వీడి బీజేపీలో చేరారు.
2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున తిరుపతి
లోక్సభ స్థానం నుంచి పోటీచేసిన వరప్రసాద్ 37,425 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో గూడురు నుంచి ఎమ్మెల్యేగా విజయం
సాధించారు. ప్రస్తుతం మళ్లీ తిరుపతి లోక్
సభకి బీజేపీ తరఫున పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.