ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న డీఎస్పీ ప్రణీత్‌రావు ఇచ్చిన సమాచారం మేరకు మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులను అరెస్ట్ చేశారు. భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు, హైదరాబాద్ సిటీ భద్రతా విభాగం డీసీపీ తిరుపతన్నలను శనివారంనాడు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.కోర్టు ఆదేశాల మేరకు ఇద్దరు నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
భారాస అధికారంలో ఉండగా భుజంగరావు, తిరుపతన్న ఎస్ఐబీలో అదనపు ఎస్పీలుగా విధులు నిర్వహించారు.స్పెషల్ ఇంటిలిజెన్స్ చీఫ్ ప్రభాకర్‌రావు, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, ఐ న్యూస్ యజమాని శ్రవణ్‌రావు పరారీలో ఉన్నారు. వీరు విదేశాలకు పారిపోయినట్లు గుర్తించారు. తెలంగాణ పోలీసులు ఇంటర్‌పోల్‌కు సమాచారం అందించారు. దీంతో వారు లుకవుట్ నోటీసులు జారీ చేశారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు