ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తీవ్ర ఆసక్తికరంగా మారాయి. గెలుపే ధ్యేయంగా పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. టీడీపీ ఇప్పటికే 139 మంది అసెంబ్లీ, 13 మంది లోక్ సభ అభ్యర్థులను ప్రకటించిగా వైసీపీ 175 అసెంబ్లీ, 24 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన పోటీదారుల జాబితాను విడుదల చేసింది.
తాజాగా జనసేన 18 మందితో జాబితాను వెల్లడించింది. పొత్తులో భాగంగా జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తోంది. తీవ్ర కసరత్తు అనంతరం 18 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన జనసేన మరో మూడు స్థానాల్లో ఎవరిని నిలపాలనే అంశంపై ఆ పార్టీ కోర్ కమిటీ తర్జనభర్జన పడుతోంది.
పొత్తులో భాగంగా తొలుత జనసేనకు 24 ఎమ్మెల్యే అభ్యర్థులను కేటాయించినప్పటకీ బీజేపీ ఎంట్రీతో 21 స్థానాలకు పరిమితమైంది.
ఇప్పటి వరకు 18 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన జనసేన అధిష్టానం, మూడు స్థానాలను పెండింగ్ లో పెట్టిదిం.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి నియామకంపై సస్పెన్స్ వీడలేదు. ఇక్కడ జనసేన, బీజేపీలో ఎవరు పోటీ చేస్తారనే విషయంపై సందిగ్ధత నెలకొంది.
అవనిగడ్డ, పాలకొండ, రైల్వే కోడూరు, ధర్మవరం, రాజంపేట నియోజకవర్గాల విషయంలో టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు.
ఈ నేపథ్యంలోనే ఐదు శాసనసభ స్థానాలపై సర్వేలు చేయించి విజయావకాశాలు ఎక్కువ ఉన్న అభ్యర్థులకు టికెట్ కేటాయిస్తున్నారు.
పి. గన్నవరం, పోలవరం స్థానాలకు జనసేన అభ్యర్థలను ప్రకటించింది. పి. గన్నవరం నుంచి టీడీపీ తరఫున మహాసేన రాజేశ్ పోటీ చేసేందుకు సిద్ధమైనప్పటికీ ఆయనకు బదులు జనసేన బరిలో నిలుస్తోంది.
జనసేన ప్రకటించిన అభ్యర్థులు
పిఠాపురం: పవన్ కళ్యాణ్
తెనాలి: నాదెండ్ల మనోహర్
నిడదవోలు: కందుల దుర్గేశ్
అనకాపల్లి: కొణతాల రామకృష్ణ
నెల్లిమర్ల: లోకం మాధవి
కాకినాడ రూరల్: పంతం నానాజీ
రాజానగరం: బత్తుల బలరామకృష్ణ
పెందుర్తి: పంచకర్ల రమేశ్
యలమంచిలి: సుందరపు విజయకుమార్
విశాఖపట్టణం దక్షిణం: వంశీకృష్ణ యాదవ్
తాడేపల్లిగూడెం: బొల్లిశెట్టి శ్రీనివాస్
భీమవరం: పులపర్తి ఆంజనేయులు
నరసాపురం: బొమ్మిడి నాయకర్
ఉంగుటూరు: పత్సమట్ల ధర్మరాజు
రాజోలు: దేవ వరప్రసాద్
తిరుపతి: ఆరణి శ్రీనివాసులు
పి.గన్నవరం: గిడ్డి సత్యానారాయణ
పోలవరం: చిర్రి బాలరాజు