ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ అస్వస్థతకు
గురయ్యారు. భద్రతా సిబ్బంది హుటాహుటిన విజయవాడ మణిపాల్ ఆసుపత్రికి తరలించగా
వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
గవర్నర్ అనారోగ్యానికి కారణాలు ఏంటన్నది ఇంకా
వెల్లడి కాలేదు. గవర్నర్ కు ఎండోస్కోపి నిర్వహించాలని వైద్యులు సూచించినట్లు
తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే
ఉందని రాజభవన్ వర్గాలు ప్రకటించాయి.
కొంతకాలంగా ఉదర సబంధిత సమస్యలతో నజీర్
బాధపడుతున్నారు. గతంలో ఆయనకు 24 గంటల కడుపునొప్పి రాగా మణిపాల్ ఆస్పత్రిలోనే
శస్త్రచికిత్స నిర్వహించారు.
గవర్నర్ నజీర్ అస్వస్థతకు గురైన విషయం
తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు, ఎక్స్
వేదికగా స్పందించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ త్వరతగతిన కోలుకోవాలని ఆకాంక్షించారు.