గత కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్న విజయవాడ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బెజవాడ బస్టాండ్‌లో బ్లేడ్ బ్యాచ్ వీరంగం వేసింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో నేరుగా పోలీసులు, ఆర్టీసి సిబ్బందిపైనే బ్లేడ్ బ్యాచ్ దాడికి దిగింది.బ్లేడ్ బ్యాచ్, మరికొందరు మందుబాబులు బస్టాండ్‌లో నిద్రించారు. ప్రయాణీకుల ఫిర్యాదులో వారిని బెంచీలు ఖాళీ చేయించే ప్రయత్నం చేసిన పోలీసులపై బ్లేడ్ బ్యాచ్ తిరగబడింది.పోలీసులపై వంద మంది దాడికి దిగారు.
బ్లేడ్ బ్యాచ్ తిరుగుబాటు చేయడంతో పోలీసులు పరుగులు తీశారు. ఆర్టీసి ఉద్యోగి సాంబయ్యకు గాయాలయ్యాయి.తెల్లవారుజామున బస్టాండ్‌లో ప్రయాణీకులు పరుగులు తీశారు. కాసేపు అసలు ఏం జరుగుతోందో అర్థకాలేదని ప్రయాణీకులు చెపుతున్నారు. సాంబయ్యపై దాడికి దాగిన వారిలో కొందరిని పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. రైల్వేస్టేషన్‌లోకి యాచకులు, బ్లేడ్ బ్యాచ్‌ను రానీయకపోవడంతో వారంతా బస్లాండ్లో నిద్రిస్తున్నారు.తెల్లవారుజామున వారిని ఖాళీ చేయించేందుకు పోలీసులు ప్రతిరోజూ నానా తంటాలు పడుతున్నారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు