దిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టైన
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు మరో మూడు రోజులు
పొడిగించింది. కవితకు గతంలో విధించిన ఏడు రోజుల కస్టడీ గడువు నేటితో ముగిసింది.
దీంతో ఆమెను న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. కస్టడీని మరో ఐదురోజులు పొడిగించాలని
ఈడీ కోరగా మూడు రోజులు పొడిగించింది.
అంతకుముందు కోర్టులోపలికి వెళ్తూ ఈడీ విచారణపై కవిత అసహనం వ్యక్తం చేశారు. ఏడాది
నుంచి అడిగిన వివరాలనే పదే పదే అడుగుతున్నారన్నారు. రాజకీయ కక్షతోనే తనపై కేసు
పెట్టారని ఆరోపించారు. కవిత ఆడపడుచు అఖిల, మేనల్లుడు
మేకా శరణ్
ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిపినట్టు అనుమానం వ్యక్తం చేస్తోన్న ఈడీ ఆ దిశగా దర్యాప్తు
చేపట్టింది. మేకా శరణ్ నివాసంలో ఈడీ సోదాలు
జరుగుతున్నాయి.
ఈడీ
తరఫున న్యాయవాది జోయాబ్ హుసేన్ వాదనలు వినిపించారు. సమీర్ మహేంద్రతో కలిపి కవితను
విచారించాల్సి ఉందని జోయాబ్ వాదించారు. వ్యాపార లావాదేవీల గురించి అడిగితే కవిత
ఇప్పటి వరకు స్పందించలేదని కోర్టుకు తెలిపారు. విచారణకు కవిత సహకరించడం లేదన్నారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు