కేంద్రం,
ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి భారీ మెజారిటీ తో గెలవబోతుందని టీడీపీ అధినేత
చంద్రబాబు అన్నారు. విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు నిర్వహించిన
వర్క్ షాపులో ప్రసంగించిన చంద్రబాబు, పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో బీజేపీ,
జనసేన నేతలు కూడా పాల్గొన్నారు. ప్రత్యర్థి కంటే భిన్నంగా ప్రచారంలో
దూసుకెళ్ళాలని అభ్యర్థులకు చంద్రబాబు మార్గనిర్దేశం
చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమికి 160 అసెంబ్లీ సీట్లు వస్తాయన్న
చంద్రబాబు, కేంద్రంలో ఎన్డీయేకి 400 పైచిలుకు సీట్లు వస్తాయన్నారు. భాగస్వామ్య
పార్టీల అభ్యర్థులను ఎన్డీయే ప్రతినిధిగా భావించి గెలిపించాలన్నారు. రాష్ట్రంలో
మూడు పార్టీలు వేసే పునాది 30 ఏళ్ళ
రాష్ట్ర భవిష్యత్ కు నాంది కాబోతుందన్నారు. పొత్తులో భాగంగా 31 మందికి టీడీపీ
టికెట్ ఇవ్వలేకపోయామన్న చంద్రబాబు, వారి త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోమని స్పష్టం
చేశారు.
రాగద్వేషాలు,
సిఫార్సులకు అతీతంగా గెలిచే అభ్యర్థులకే టికెట్ దక్కిందన్న చంద్రబాబు, కూటమి నుంచి
పోటీ చేసే ప్రతీ అభ్యర్థి గెలవాల్సిందేనన్నారు. సేవాభావంతో రాజకీయాలు చేసే పవన్,
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరిపై వైసీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం
చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం ఓట్లు చీలకూడదనే ఉద్దేశ్యంతో ఉమ్మడి గా టీడీపీ, బీజేపీ, జనసేన పోటీ
చేస్తున్నాయన్నారు.