బీజేపీ
రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి పేరిట చక్కర్లు కొడుతున్న నకిలీ లెటర్ పై ఆ
పార్టీ నేతలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశాఖ లో పట్టుబడిన డ్రగ్స్
కంటెయినర్ కేసుతో పురందరేశ్వరి మనస్తాపం చెంది రాజీనామా చేసినట్లు ఓ ఫేక్ లెటర్
సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిని గుర్తించిన ఏపీ బీజేపీ నేతలు పోలీసులకు
ఫిర్యాదు చేశారు.
ఫేక్ లెటర్ క్రియేట్ చేసి వైరల్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని
కోరారు. ఫేక్ లెటర్ ను వైసీపీ నేతలే సృష్టించి ఉంటారని బీజేపీ రాష్ట్ర మైనార్టీ
మోర్చా అధ్యక్షుడు
షేక్
బాజీ ఆరోపించారు. పురందరేశ్వరిపై వస్తున్న తప్పుడు ఆరోపణలను బీజేపీ
ఖండిస్తోందన్నారు. సంధ్య మెరైన్స్ నుంచి విడిపోయిన ఆర్ధిక నేరస్థుడు వీరభద్రరావు
పెట్టుకున్న కంపెనీ సంధ్య ఆక్వా ఎక్స్ పోర్ట్ అని వివరించారు. ఈ కంపెనీ యాజమాన్యంతో వైసీపీ నాయకులతో సంబంధాలు
ఉన్నాయన్నారు.
చంద్రబాబును అరెస్ట్ సమయంలో కూడా ఇదే తరహా ఫేక్ లెటర్ ను సర్క్యు లేట్
చేశారని గుర్తు చేశారు.
గతంలో
చాక్లెట్లలో మత్తు పదార్థాలు విక్రయించిన కేసు దర్యాప్తులో వైసీపీ నేత పుత్రరత్నం
పాత్ర బయటపడిందన్నారు.
బీజేపీ
రాష్ట్ర అధ్యక్షురాలి పేరిట ఫేక్ ఎక్స్ ఖాతాను సృష్టించారన్నారు. పోలీసులకు
ఫిర్యాదు అందజేసిన నేతల్లో బీజేపీ లీగల్ సెల్ నేత హేమంత్ కుమార్ ఉన్నారు.