బ్రిటన్ రాజ కుటుంబంలో మరొకరు
కేన్సర్ బారిన పడినట్లు వార్తలు బయటకొచ్చాయి. రాజు ఛార్లెస్ కేన్సర్ చికిత్స
తీసుకుంటున్న తరుణంలోనే బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ కూడా ఈ వ్యాధి బారినపడ్డారు.
కేన్సర్ కు చికిత్స తీసుకుంటున్న విషయాన్ని కేట్ స్వయంగా వీడియో సందేశంలో
వెల్లడించారు. బ్రిటన్ సింహాసనానికి వారసుడైన, యువరాజు విలియమ్స్ భార్య కేట్
మిడిల్టన్.
జనవరిలో కేట్
శస్త్రచికిత్స చేయించుకుని రెండు వారాల
పాటు ఆసుపత్రిలోనే గడిపారు. ఆపరేషన్‌కు గల కారణాలను గోప్యంగా ఉంచారు. ఆ తర్వాత
జరిపిన పరీక్షల్లో ఆమెకు క్యాన్సర్ నిర్ధారణ అయింది. వ్యాధి మరింత ముదరకుండా
చికిత్స తీసుకుంటున్నట్లు కేట్ తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగుపడుతోందని
కూడా చెప్పారు.
బ్రిటన్
రాజు ఛార్లెస్ కూడా కేన్సర్ బారిన పడినట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ గతంలో
ప్రకటించింది. కేట్ చికిత్స తీసుకుంటున్న ఆసుపత్రిలోనే ఆయన జనవరిలో ప్రొస్ట్రేట్
గ్రంధి సమస్యకు ట్రీట్మెంట్ తీసుకున్నారు.