మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు, భారత్
పట్ల అనుసరించే వైఖరి మార్చుకున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చైనాకు అనుకూలంగా
వ్యవహరిస్తున్న ముయిజ్జు, తన స్వరం మార్చి భారత్ పై ప్రశంసలు కురిపించారు.
మాల్దీవులకు భారత్ ఎప్పటకీ సన్నిహిత
మిత్రుడే అని వ్యాఖ్యానించిన ముయిజ్జు, రుణ విముక్తికి సహకరించాలని విన్నవించారు.
గతే ఏడాది చివరి నాటికి భారత్కు
మాల్దీవులు దాదాపు 400.9 మిలియన్ డాలర్లు బకాయిపడింది. అప్పు
చెల్లింపులో ఉపశమనం కల్పించాలని కోరారు. అధ్యక్షుడిగా
ఎన్నికైన తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన ముయిజ్జు మాల్దీవులకు సాయం
అందించడంలో భారత్ కీలక పాత్ర పోషించిందన్నారు. పెద్ద మొత్తంలో ప్రాజెక్టులను
నిర్మించిందని గుర్తు చేశారు.
ఇరుదేశాల మధ్య స్నేహసంబంధాలు కొనసాగుతాయనడంలో ఎలాంటి
సందేహం అవసరం లేదన్నారు.
మాల్దీవుల గత ప్రభుత్వాలు చేపట్టిన
చర్యల వల్ల భారత్ నుంచి తీసుకున్న అప్పులు భారీగా పేరుకుపోయాయన్నారు.
ప్రధాని
మోదీతో దుబాయ్ వేదికగా జరిగిన కాప్ 28
సదస్సు లో పలు విషయాలు చర్చించినట్లు ముయిజ్జు తెలిపారు.
గత ఏడాది నవంబర్లో మాల్దీవుల
అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి ముయిజ్జు.. చైనాకు అనుకూలంగా
వ్యవహరిస్తున్నారు. మే 10 నాటికి భారత్కు చెందిన బలగాలు తమ
దేశాన్ని వీడి వెళ్లిపోవాలని ముయిజ్జు గడువు విధించారు. తాజాగా స్వరం మార్చి అప్పు
చెల్లింపు నుంచి ఉపశమనం ఇవ్వాలని కోరుతున్నారు.