Capital Punishment
in rape and murder of a minor girl
మహారాష్ట్ర పుణె జిల్లా మావల్ తాలూకాలో
ఆరేళ్ళ బాలికపై అత్యాచారం, హత్య కేసులో 24 ఏళ్ళ యువకుడికి పుణె సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది.
2022 ఆగస్టులో మావల్
జిల్లా కమ్‌షెట్‌లో తన ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న ఒక ఆరేళ్ళ
బాలికను స్థానిక యువకుడు ఒకడు కిడ్నాప్ చేసి
అత్యాచారం చేసి చంపేసాడు. మరుసటి రోజు నిందితుడి పెరట్లో బాలిక మృతదేహం దొరికింది.సాక్ష్యాధారాలను దాచిపెట్టినందుకు,జరిగిన సంఘటనను పోలీసులకు ఫిర్యాదు చేయనందుకు నేరస్తుడి తల్లికి కూడా
ఏడేళ్ల జైలు శిక్ష విధించారు.
విచారణలో నిందితులిద్దరూ నేరాన్ని
అంగీకరించారు, కానీ పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసినప్పుడు మాత్రం తాము నేరం
చేయలేదని బుకాయించారు. అయినప్పటికీ విచారణలో వారి అకృత్యం నిరూపితమైంది.
బాలికను రేప్ చేసి చంపేసిన తర్వాత, ఆ మృతదేహాన్ని
ఇంటి వెనుక చెట్టు కింద గుంతలో పూడ్చిపెట్టేందుకు నిందితుడు ప్రయత్నించాడు. అతన్ని
కాపాడేందుకు అతని తల్లి మృతురాలి దుస్తులు, వస్తువులను దాచిపెట్టిందని, అందువల్ల
నిందితులిద్దరినీ శిక్షించాలని పబ్లిక్ ప్రోసిక్యూటర్ కవేడియా న్యాయస్థానాన్ని
కోరారు.
ఈ కేసు 2022 అక్టోబర్‌లో విచారణకు వచ్చింది. చార్జిషీట్ దాఖలు చేసిన 8 నెలల్లోనే 29 మంది సాక్షులను విచారించి, కేసు
ముగించారు. నిందితుడి తరఫు లాయర్, మరణశిక్షకు వ్యతిరేకంగా పైకోర్టును
ఆశ్రయిస్తామని వెల్లడించారు.
పుణె అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి బీపీ క్షీరసాగర్
విచారణ జరిపారు. ఈ ఘటన 2022 ఆగస్టులో జరగ్గా,ఏడాది
ఏడు నెలల్లోనే శిక్ష పడడం విశేషం.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు