Police rapes
minor girl, cases registered under IPC and POCSO
పోలీసు అధికారే మైనర్ బాలికపై అత్యాచారానికి
పాల్పడిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. పదహారేళ్ళ బాలికపై అత్యాచారం చేసిన నేరానికి
హనుమకొండ జిల్లా కేయూ పోలీస్ స్టేషన్లో అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసులు నమోదయ్యాయి.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు,
బండారి సంపత్ ప్రస్తుతం భూపాలపల్లి విఆర్ సిఐ గా పనిచేస్తున్నాడు. అతను 2022లో కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో సబ్ఇనస్పెక్టర్గా పనిచేశాడు.
అప్పట్లో హనుమకొండలోని ఒక మహిళతో సన్నిహితంగా ఉండేవాడు.
తర్వాత ఖమ్మం జిల్లాకు సిఐగా బదిలీ అయినా, ఆమెతో స్నేహాన్ని కొనసాగించాడు. ఆ క్రమంలో
కొద్దిరోజులుగా ఆ మహిళ కూతురిపై (16) అతని దృష్టి పడింది. ఒకరోజు ఆ మహిళ లేనప్పుడు
ఆమె కుమార్తెపై అత్యాచారం చేసాడు. బాలిక జరిగిన
విషయాన్ని తల్లికి చెప్పడంతో, ఆమె కేయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
విషయం తెలిసిన పోలీసులు బాధితురాలి ఇంటికి వెళ్లి
విచారణ జరిపారు. వారి సీఐ మీద అత్యాచారంతోపాటు, పోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేశారు.