ప్రధాని మోదీకి అరుదైన ఘనత దక్కింది. భూటాన్ ప్రభుత్వం ప్రధాని మోదీకి అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ గ్యాల్పోను అందించింది. భూటాన్ రాజు, ప్రధాని మోదీకి ఈ పురస్కారం ప్రధానం చేశారు. విదేశాల్లో భూటాన్‌కు చెందిన ఈ అత్యున్నత పురస్కారం అందుకున్న మొదటి వ్యక్తిగా ప్రధాని మోదీ నిలిచారు.
2021లోనే ప్రధాని మోదీకి భూటాన్ ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ గ్యాల్పోను ప్రకటించింది. కరోనా సమయంలో భారత్ భూటాన్‌కు 5 లక్షల టీకాలు అందించింది. ఈ అవార్డును 140 కోట్ల భారతీయులకు అంకితం చేస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
ప్రధాని మోదీ భూటాన్ పర్యటనలో ఆ దేశ ప్రధాని దాషో షెరింగ్ తోబ్గేతో చర్చలు జరుపుతున్నారు. వ్యవసాయం, పర్యావరణం, పర్యాటకం, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంపై ప్రధానంగా పలు ఒప్పందాలు చేసుకునే అవకాశముంది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తరవాత భూటాన్‌లో పర్యటించడం ఇది మూడోసారి కావడం గమనార్హం.