దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన
ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ పై సామాజిక కార్యకర్త అన్నా హజారే
కీలక వ్యాఖ్యలు చేశారు.
కేజ్రీవాల్ తప్పు చేసినందునే అరెస్టు
అయ్యాడంటూ తేల్చి చెప్పిన అన్నా హజారే, మద్యానికి వ్యతిరేకంగా గొంతెత్తి నిరసనలు
చేసిన వ్యకే, లిక్కర్ పాలసీని రూపొందించారని దుయ్యబట్టారు.
లిక్కర్ పాలసీపై
కేజ్రీవాల్‌కు లేఖ రాసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత లాభం కోసమే
కేజ్రీవాల్ లిక్కర్ పాలసీ రూపొందించారని విమర్శించారు.
అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి గతంలో పని చేసినందుకు సిగ్గుపడుతున్నానని
ప్రకటించిన హజారే, అతనికి ఎలాంటి సలహాలు ఇవ్వదలుచుకోలేదన్నారు. చట్టం తనపని తాను
చేసుకుపోతుందన్నారు.
అన్నా హజారే, 2011లో అవినీతి వ్యతిరేక ఉద్యమం ప్రారంభించగా దేశ
వ్యాప్తంగా మంచి స్పందన లభించింది. దీని నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అవతరించింది.
తర్వాతి కాలంలో కేజ్రీవాల్ ను పలు విషయాల్లో హజారే వ్యతిరేకించారు. ఆప్ ప్రభుత్వ
ప్రజా వ్యతిరేక విధానాలపై లేఖలు రాసినా కేజ్రీవాల్ స్పందించలేదు.