యూపీఏ
ప్రభుత్వం హయాంలో సంచలనం రేపిన 2జీ స్కామ్ లో ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సీబీఐ
హైకోర్టులో సవాలు చేయగా ధర్మాసనం విచారణకు స్వీకరించింది. కేంద్రమాజీమంత్రి,
డీఎంకే ఎంపీ ఎ. రాజా, మరో ఎంపీ కనిమొళి సహా పలువురిని నిర్దోషిగా ప్రకటిస్తూ
ట్రయల్ కోర్టు, 2017, డిసెంబర్ 21న వెల్లడించిన తీర్పును సీబీఐ హైకోర్టులో సవాల్
చేసింది. ధర్మాసనం విచారణకు స్వీకరించింది. అనంతరం తదుపరి విచారణను మే నెలకు
వాయిదా వేసింది.
2018 మార్చిలో సీబీఐ ఈ పిటిషన్ దాఖలు చేయగా దాదాపు ఆరేళ్ళ తర్వాత
తీర్పు వచ్చింది. ఈ ఏడాది మార్చి 14న తీర్పు రిజర్వు చేసిన ధర్మాసనం, తాజాగా అప్పీలు
పిటీషన్ ను విచారణకు స్వీకరిస్తున్నట్లు వెల్లడించింది.
సీబీఐ
తరఫు న్యాయవాదులు అందజేసిన సాక్ష్యాలను పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ దినేశ్
కుమార్ శర్మ, అప్పీలు పిటీషన్ ను విచారణకు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ
స్కామ్ లో నిందితులుగా ఉన్న కేంద్ర
మాజీమంత్రి ఎ రాజాతో పాటు 14 మందిని సీబీఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. రాజా, కనిమొళిపై దాఖలు చేసిన కేసుల్లో సరైన సాక్ష్యాలు లేవని
ట్రయల్ కోర్టు అభిప్రాయపడింది.
యూపీఏ హయాంలో జరిగిన ఈ కుంభకోణంతో ప్రభుత్వ ఖజానాకు రూ.1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్లు
కంప్రోల్టర్ అండ్ ఆడిటర్ జనరల్ 2010
ఏడాది నివేదికలో పేర్కొంది.
ఈ స్కామ్ పై సీబీఐ రెండు కేసుల నమోదు చేయగా, ఈడీ మరో కేసు నమోదు చేసింది.
స్వాన్ టెలికం కంపెనీకి 2జీ
లైసెన్సులను తక్కువ మొత్తానికి కేటాయించారని అందుకు ప్రతిఫలంగా డీఎంకేకు చెందిన
కలైంజర్ టీవీ, టీపీ గ్రూపులకు రూ.200 కోట్లు లంచం అందినట్లు కేసు
నమోదైంది. 2జీ స్పెక్ట్రం హక్కులను
122 సంస్థలకు తక్కువ మొత్తానికే
కేటాయించడంతో పాటు అర్హత లేనిక కంపెనీలకు కట్టబెట్టడంతో ప్రభుత్వానికి నష్టం
వాటిల్లిందని ఛార్జీషీటులో సీబీఐ పేర్కొంది.