విశాఖ పోర్టులో భారీ డ్రగ్ రాకెట్‌ను సీబీఐ అధికారులు గుర్తించారు. బ్రెజిల్ నుంచి కంటెయినర్లో విశాఖ ఓడరేవుకు నిషేధిత 25వేల కేజీల డ్రగ్స్ సరఫరా అవుతోన్నట్లు ఇంటర్‌పోల్ అందించిన సమాచారంతో సీబీఐ అధికారులు రంగంలోకి దిగి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్లో లక్ష కోట్ల పైగానే ఉంటుందని అంచనా. బ్రెజిల్ శాంటోస్ పోర్టు నుంచి డ్రైడ్ ఈస్ట్ పేరుతో విశాఖకు కంటెయినర్ బుక్ చేశారు. ఇది సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఉన్నట్లు సీబీఐ గుర్తించింది.
జర్మనీ పోర్టు మీదుగా పాస్ అవుతోన్న సమయంలో అనుమానం వచ్చి స్క్రీనింగ్ చేశారు. మాదకద్రవ్యాలు ఉన్నట్లు గుర్తించారు. ఇంటర్‌పోల్ సీబీఐకి సమాచారం అందించింది. 16న విశాఖకు నౌక చేరడంతో ఢిల్లీ నుంచి దిగిన సీబీఐ అధికారులు, స్థానిక సిబ్బందితో కలసి తనిఖీలు నిర్వహించారు. కంటెయిర్ లోపల 25 కేజీల చొప్పున వెయ్యి సంచులు ఉన్నట్లు గుర్తించారు. 19వ తేదీన శాంపిల్స్ తీసి నార్కోటిక్ డ్రగ్స్ డిటెక్షన్ కిట్ల ద్వారా పరీక్షలు జరిపించారు.
స్వాధీనం చేసుకున్న కంటెయినర్లో లక్ష కోట్ల విలువైన డ్రగ్స్ ఉన్నట్లు తేలింది. 27 నమూనాల్లో నల్లమందు, కొకైన్, హెరాయిన్, మార్ఫిన్, యాంఫటేమిన్ మెస్కలిన్ వంటి నిషేధిత మాదక ద్రవ్యాలను గుర్తించారు. తనిఖీ చేసిన 20 ప్యాకెట్లలో కొకైన్, మెథాక్వలోన్ డ్రగ్స్ ఉన్నట్లు తేలింది. దీనిపై లోతైన విచారణ కొనసాగుతోంది. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. గతంలో కూడా గుజరాత్ పోర్టు నుంచి విజయవాడ చిరునామాతో భారీగా డ్రగ్స్ దిగుమతి చేసుకునే సమయంలో సీబీఐ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు