Wednesday, July 2, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home ఆధ్యాత్మికం

చితాభస్మంతో హోలీ ఆడే ప్రదేశం ఏదో మీకు తెలుసా?

param by param
May 12, 2024, 08:34 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Do you know where Holi is played with mortal ashes?

హోలీ పండుగ అంటే అందరికీ ఒక ఉత్సాహం. రంగులు
జల్లుకుంటూ వేడుక జరుపుకోవడం ఆ పండుగ ప్రత్యేకత. దక్షిణభారతదేశంలో హోలీ జరుపుకోవడం
తక్కువే కానీ ఉత్తర భారతదేశంలో ఈ పండుగను వారం పది రోజుల పాటు విశేషంగా
జరుపుకుంటారు. ఒక్కోరోజు ఒక్కో రకంగా వేడుక చేసుకుంటారు.

కానీ, శ్మశానంలో శవదహనాల తర్వాత వచ్చే
చితాభస్మంతో హోలీ పండుగ జరుపుకునే ప్రదేశం ఒకటి మన దేశంలో ఉంది. అదెక్కడో తెలుసా?
పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన కాశీ పుణ్యక్షేత్రంలో. అక్కడ కూడా గంగానది ఒడ్డున
ఉన్న ప్రసిద్ధ మణికర్ణికా ఘాట్‌లోనే ఈ రకమైన విచిత్రమైన హోలీ జరుపుకోవడం ఆనవాయితీ.

హిందీలో శ్మశానాన్ని మసాన్ అంటారు. అందుకే ఈ
హోలీని ‘మసాన్ హోలీ’ అని కూడా పిలుస్తారు. మరి దాని ప్రత్యేకతలేంటో చూద్దామా…

లయకారకుడైన పరమేశ్వరుడి నివాసస్థానం కాశీ
పుణ్యక్షేత్రం. అక్కడ ఈ చితాభస్మంతో హోలీ పండుగ జరుపుకునే సంప్రదాయానికి ఒక కథ
ఉంది. పార్వతీ దేవితో వివాహం అనంతరం పరమశివుడు ఆమెను ఏకాదశి పుణ్యతిథి నాడు కాశీ
తీసుకుని వచ్చాడట. శివుడు భూతగణాధిపతి కదా. ఆయన వివాహం జరిగిందన్న ఉత్సాహంలో శివుడి
ప్రమథ గణాలు, భూతప్రేతాలూ కలిసి మణికర్ణికా ఘట్టంలో చితాభస్మంతో హోలీ ఉత్సవం
జరుపుకున్నాయట. ఆ ఉత్సవంలో స్వయంగా శివభగవానుడు కూడా పాల్గొన్నాడట. అప్పటినుంచీ
ప్రతీయేటా వారణాసిలోని మణికర్ణికాఘట్టంలో ‘మసాన్ హోలీ’ ఆడడం సంప్రదాయంగా మారింది. ఆ
రోజు భూతనాథుడైన పరమేశ్వరుడు స్వయంగా రహస్యరూపంలో శ్మశానానికి వస్తాడట. ఈ యేడాది
మసాన్ హోలీ పండుగ ఇవాళ, అంటే గురువారం మార్చి 21న వచ్చింది.

కాశీలోని మణికర్ణికా ఘాట్ అత్యంత ప్రాచీనమైన నదీఘట్టం.
ఎన్నో ధార్మిక గ్రంథాల్లో ఆ ఘట్టం గురించిన వర్ణనలు ఉన్నాయి. పురాణాల ప్రకారం…
ఒకసారి పార్వతీదేవి కర్ణపుష్పాలు (చెవికి ధరించే ఆభరణాలు) అక్కడ ఒక కుండంలో
పడిపోయాయట. వాటిని పరమశివుడు వెతికి తీసుకెళ్ళి అమ్మవారికి ఇచ్చాడట. పార్వతీదేవి
కర్ణాభరణాలు పడిపోయిన చోటు కాబట్టి ఆ ఘట్టానికి మణికర్ణికాఘాట్ అనే పేరు వచ్చిందట.
ఆ ఘాట్‌కు మరో విశేషం కూడా ఉంది. మహాదేవుడు సతీదేవి కళేబరానికి అగ్నిసంస్కారం
చేసిన చోటు కూడా అదే. అందుకే ఆ ప్రదేశాన్ని మహాశ్మశానం అని కూడా పిలుస్తారు.

కాశీలోని మణికర్ణికాఘాట్
వద్ద చితాభస్మంతో హోలీ ఆడే సంప్రదాయం వెనుక ఒక ఆధ్యాత్మిక రహస్యం కూడా ఉంది.
ధార్మిక గ్రంథాల ప్రకారం… ఈ ప్రపంచం నశ్వరమైనది, అంటే నశించిపోయే లక్షణం ఉన్నది.
 ఈ ప్రపంచం ఏదో ఒకరోజు భస్మంగా మారిపోక
తప్పదు. ఈ భూమి మీద నివసించే ప్రతీ ప్రాణికీ అదే గతి పడుతుంది. అందుకే ఈ నశ్వరమైన
ప్రపంచం మీద, మన జీవితం మీద ఎక్కువ మోహం పెంచుకోకూడదు అన్నదే ఈ ‘మసాన్ హోలీ’ మనకిచ్చే
సందేశం.

Tags: Holi with Mortal AshesKashiManikarnika GhatMasaan Holi
ShareTweetSendShare

Related News

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్
general

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి
general

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట
general

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

శ్రీవాణి టికెట్ల జారీకి ప్రత్యేక కౌంటర్లు
general

శ్రీవాణి టికెట్ల జారీకి ప్రత్యేక కౌంటర్లు

Latest News

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

భారత అంతరిక్ష రంగంలో మరో మైలురాయి : భూ కక్ష్యలోకి శుభాంశు శుక్లా

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.