ఎన్నికల బాండ్లకు సంబంధించి, సీరియల్ నెంబర్లతో సహా అన్ని వివరాలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించినట్లు ఎస్‌బీఐ, సుప్రీంకోర్టుకు తెలిపింది. సీఈసీకి పూర్తి వివరాలు అందించినట్లు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఎన్నికల బాండ్ల వివరాలన్నీ అందించినట్లు అఫిడవిట్‌లో పేర్కొంది.
గత ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఐదేళ్లలో ఎస్‌బిఐ జారీ చేసిన బాండ్ల వివరాలు అందించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. మొదట అరకొర సమాచారం ఇవ్వడంతో సుప్రీంకోర్టు, ఎస్‌బిఐ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఎన్నికల సంఘానికి ఎస్‌బిఐ పూర్తి సమాచారం అందించింది.