ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాగానే టెట్ ఫలితాలు విడుదల చేస్తామని విద్యాశాఖ వెల్లడించింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాల కోసం లక్షలాది మంది ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. టెట్‌లో క్వాలిఫై అయితేనే డీఎస్సీ రాయడానికి అర్హత లభిస్తుంది. టెట్ మార్కులకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ కూడా ఉంది. మార్చి 14న టెట్ ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. అధికారులు షెడ్యూల్ ప్రకారం విడుదల చేయలేదు. మార్చి 16న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇప్పుడు సీఈసీ అనుమతి కోసం వేచి చూస్తున్నారు.
ఎన్నికలకు కొద్ది నెలల ముందు డీఎస్సీ, టెట్ నోటిఫికేషన్లు విడుదల చేయడంతో ఇప్పుడు కోడ్ అడ్డంకిగా మారింది. డీఎస్సీ ఫలితాలు కూడా ఎన్నికల సంఘం అనుమతిస్తే విడుదలకు అవకాశం ఉంటుంది. డీఎస్సీ షెడ్యూల్ కూడా మార్చడంతో నేటికీ పరీక్షా కేంద్రాల ఎంపికకు ఐచ్చికాలు కూడా ఇవ్వలేదు. దీంతో 4 లక్షల మందికిపైగా నిరుద్యోగులు అయోమయంలో పడ్డారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు