సోషల్ మీడియాలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోన్న నకిలీ సమాచారానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. సమాచారం నకిలీదా? సరైనదా తెలుసుకునేందుకు కేంద్రం ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏర్పాటు చేసింది. దీని అమలుపై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు విఘాతం కలిగించేలా ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
ఆన్లైన్ సమాచారంలో నకిలీ సమాచారాన్ని గుర్తించేందుకు కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021కు కేంద్రం ఇటీవల సవరణలు చేసింది. ఇందులోని నిబంధనలు ఏకపక్షంగా, రాజ్యాంగం వ్యక్తులకు కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలసిందే. దీనిపై స్టాండప్ కమెడియన్ కునాల్ కుమ్రా, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ముంబై హైకోర్టును ఆశ్రయించారు.
ముంబై హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అమలుకు కేంద్రం మార్చి 20న విడుదల చేసిన నోటిఫికేషన్‌పై సుప్రీంకోర్టు తాజాగా స్టే విధించింది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు