ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2018 గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ జడ్జి తీర్పు వెలువరించిన విషయం తెలసిందే. కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీపీఎస్సీ హైకోర్టులోని త్రిసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించింది. గురువారం కేసును విచారించిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్టే విధించింది. తదుపరి విచారణను మార్చి 27కు వాయిదా వేసింది.
2018 గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో విచారించిన సింగిల్ జడ్జి, మెయిన్స్ పరీక్షలను రద్దు చేశారు. దీనిపై ఏపీపీఎస్సీ అప్పీల్‌కు వెళ్లింది. మరోసారి విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం, స్టే విధించింది. వారం తరవాత మరోసారి విచారించి హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది.