కేంద్ర మంత్రి పదవికి పశుపతి కుమార్ పరాస్ రాజీనామా చేశారు. ఎన్డీయే కూటమిలోని లోక్‌జనశక్తి పార్టీ అధ్యక్షుడు, బిహార్‌లో తమ పార్టీకి బీజేపీ అన్యాయం చేసిందంటూ కేంద్ర మంత్రి పదవికి పశుపతి కుమార్ పరాస్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము వెంటనే ఆమోదించారు. పరాస్ రాజీనామాను ఆమోదించినట్లు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో తెలిపింది.
పరాస్ రాజీనామాతో ఆహారశుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ బాధ్యతలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు అప్పగించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బిహార్‌లోని హజీపుర్ నుంచి ఎల్జేపీ అధినేత చిరాగ్ పాస్వాన్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన బాబాయి అయిన పశుపతి పరాస్ కూడా హజీపుర్ నుంచే పోటీ చేస్తామని ప్రకటించడం రాజకీయ వివాదానికి దారితీసింది.